paruchiri: దమ్ముతో దుమ్ము రేపేవాళ్లు వెనక్కి తిరిగి చూడరు: పవన్ కల్యాణ్‌పై పరుచూరి ప్రశంస

  • పవన్ 2+2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడు
  • ప్రతి జన సైనికుడూ పవన్‌కు ఒక గన్‌మెనే కదా
  • పవన్‌ వెనక చూసుకోడానికి జనసైన్యం ఉంది
  • ఆ పక్క ఈ పక్క వామపక్షాలున్నాయి

ఏపీ సర్కారు తన భద్రతకు నియమించిన నలుగురు గన్‌మెన్‌ను సినీన‌టుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వెనక్కి పంపిన విష‌యం తెలిసిందే. వారిద్వారా ప‌వ‌న్‌పై స‌ర్కారు నిఘా పెట్టిందని, అందుకే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ విషయంపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ పవన్ నిర్ణయాన్ని ప్రశంసించారు.

 'పవన్ కల్యాణ్ తన భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన 2 ప్లస్ 2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడట.. ప్రతి జన సైనికుడూ తనకు ఒక గన్‌మెనే కదా.. దమ్ముతో దుమ్ము రేపేవాళ్లు వెనక్కి తిరిగి చూడరు. వెనక చూపు చూసుకోడానికి వెంట జనసైన్యం ఉంది, ఆ పక్క ఈ పక్క వామపక్షాలున్నాయి. ప్రశ్నించడమే గెలుపుగా సాగిపో' అంటూ ట్వీట్‌ చేసి పవన్‌ను ఆయన ప్రోత్సహించారు.

More Telugu News