flight: ఆలస్యంగా తీసుకెళితే విమానయాన సంస్థ రూ.20,000 చెల్లించుకోవాలిక!

  • డీజీసీఏ ప్రతిపాదన
  • విభేదించిన విమానయాన సంస్థలు
  • ప్రయాణానికి తిరస్కరిస్తే రూ.5,000 జరిమానా

విమానయాన సంస్థలు ఇక మీదట ప్రయాణికులను ఆలస్యంగా తీసుకెళితే రూ.20,000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. సర్వీసుల రద్దు లేదా ఆలస్యం కారణంగా కనెక్టింగ్ ఫ్లయిట్స్ (అంటే ఒక ప్రాంతం నుంచి ప్రయాణికుడిని మరో విమానాశ్రయంలోని ఫ్లయిట్ కు అందేలా తీసుకెళ్లడం)ను అందుకునే విషయంలో విఫలమైతే జరిమానా చెల్లించాలన్న ప్రతిపాదనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీసుకొచ్చింది.

ఇక విమానంలో ప్రయాణించేందుకు ఎవరినైనా తిరస్కరిస్తే రూ.5,000ను జరిమానాగా ప్రయాణికులకు చెల్లించాలని కూడా డీజీసీఏ ప్రతిపాదించింది. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోతుండడంతో ఈ జరిమానాను తీసుకొచ్చారు. అయితే, డీజీసీఏ ప్రతిపాదనతో విమానయాన సంస్థలు విభేదించడం గమనార్హం. దీనిపై డీజీసీఏ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News