cash crunch: రూ.2,000 నోట్లను బయటకు రప్పించేందుకు ఐటీ శాఖ దాడులు

  • ఏపీ, కర్ణాటక వ్యాప్తంగా కొనసాగిన సోదాలు
  • 30-35 ప్రాంతాల్లో జరిగినట్టు అధికారిక సమాచారం
  • రూ.2,000 నోట్లను పెద్ద ఎత్తున దాచిపెట్టినట్టు వార్తలు

దేశవ్యాప్తంగా  చాలా రాష్ట్రాల్లో నగదుకు తీవ్ర కటకటలు ఏర్పడినట్టు వచ్చిన వార్తలతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులకు దిగారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 30-35 చోట్ల ఇవి కొనసాగాయి. నగదును పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడమే ఈ కొరతకు కారణమంటూ, మరీ ముఖ్యంగా రూ.2,000 నోట్లలో సగానికి పైగా వ్యవస్థలోకి తిరిగి రావడం లేదంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆదాయపన్ను శాఖ ఈ సోదాలు చేపట్టింది. ఇంత వరకు పెద్దగా ఏమీ పట్టుబడలేదు. మరోవైపు మరింత నగదును రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు ఆర్ బీఐ చర్యలు మొదలు పెట్టింది. విమానాల ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో నగదుకు తీవ్ర కటకటలు నెలకొన్నాయి.

More Telugu News