5 కోట్ల రూపాయల ఆఫర్ ను శ్రీరెడ్డి తిరస్కరించింది: రాంగోపాల్ వర్మ
- వివాదం పరిష్కరిస్తానని నేనే ముందుకొచ్చాను
- సెటిల్ మెంట్ చేసుకోవాలని శ్రీరెడ్డికి చెప్పాను
- ఐదు కోట్లు వచ్చేలా చేస్తానని అన్నాను
సెటిల్ మెంట్ చేసుకోవాలని శ్రీరెడ్డికి సూచించానని, సురేష్ కుటుంబం నుంచి ఐదు కోట్లు వచ్చేలా చేస్తానని కూడా చెప్పానని ఆయన వెల్లడించారు. ఈ విషయాలేవీ సురేష్ బాబుకి తెలియవని ఆయన అన్నారు. అయితే తన ఆఫర్ ని శ్రీరెడ్డి నిరాకరించిందని, తాను డబ్బులు తీసుకుంటే చేస్తున్న పోరాటానికి అర్థం ఉండదని, ఎన్నో కుటుంబాలకు లాభం చేకూర్చేందుకు చేసే పోరాటాన్ని పక్కదోవ పట్టించలేనని శ్రీరెడ్డి తనకు చెప్పిందని, ఆమె అంత డబ్బు వదులుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన అన్నారు.