charan: ఆ సీన్ గురించి చిరంజీవి గారికి ఎంతగా చెప్పినా నమ్మలేదు: సుకుమార్

  • చరణ్ ఆ సీన్ చాలా సహజంగా చేశాడు 
  • ఆ సీన్ నేను చేసి చూపించలేదు 
  • ఆ మాట చెబితే చిరంజీవి గారు నమ్మలేదు

మాస్ హీరోగా చరణ్ కి మంచి క్రేజ్ వుంది .. అలాంటి హీరో 'రంగస్థలం' సినిమాలోని ఒక సీన్ లో గిన్నెలు తోమడం చూపించారు. నిజంగా దానికి చాలా సాహసం కావాలి .. చరణ్ ని ఎలా ఒప్పించారు? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో సుకుమార్ కి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. "చరణ్ చేసినది మట్టికి దగ్గరగా వుండే పాత్ర" అన్నారు.

"గొప్ప విషయం ఏమిటంటే చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు .. ఇంట్లో రోజూ గిన్నెలు తోముతున్నట్టు .. వంట చేస్తున్నట్టు చాలా సహజంగా చరణ్ చేయడంతో మేము షాక్ అయ్యాము. ఆ సీన్ చూసి చిరంజీవి గారు .. 'నువ్వు చేసి చూపించి ఉంటావ్ .. అందుకే అంత బాగా చేశాడు' అన్నారు. 'నిజంగానే నేను చేసి చూపించలేదు సార్ .. ఆయన అంతగా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడంతే' అని చెప్పాను. 'నేను ఎన్ని సార్లు చెప్పినా చిరంజీవి గారు మాత్రం నమ్మలేదు' అంటూ నవ్వేశాడు.    

More Telugu News