Tollywood: వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి.. ఇండస్ట్రీని మాత్రం చులకన చేసి మాట్లాడకండి!: నాగబాబు

  • కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి
  • అంతే తప్పా, ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దు
  • ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదు
  • తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదు
శ్రీరెడ్డి వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేనని, ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని గత నెల రోజులుగా గమనిస్తున్నానని, ‘మా’లో సభ్యత్వం ఉన్న, సభ్యత్వం లేని లేడీ ఆర్టిస్టులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చని, దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని అన్నారు.

కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి, అంతే తప్పా, ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దని సూచించారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని అన్నారు. ‘మా’ అసోసియేషన్ లో ఉన్న సభ్యులకు న్యాయం చేయడం తమ బాధ్యతని, ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదని, తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదని అన్నారు.
Tollywood
nagababu

More Telugu News