Tollywood: 'శ్రీరెడ్డికి ముందు.. శ్రీరెడ్డికి తర్వాత'గా తెలుగు సినీ పరిశ్రమ విడిపోతుంది: దర్శకుడు వర్మ

  • తిరుగుబాటు చర్య ఏదైనా  ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది
  • ఏ కారణాల వల్ల తిరుగుబాటు చేశారో ఆలోచించకుండా నెగెటివ్ గా రియాక్టు అవుతారు
  • చేగువేరా చెప్పిన సత్యమిదే

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ పద్ధతి ఉందంటూ ఆరోపణలు గుప్పించిన నటి శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. శ్రీరెడ్డి ప్రభావంతో ఇకపై 'శ్రీరెడ్డికి ముందు.. శ్రీరెడ్డికి తర్వాత'గా తెలుగు సినీ పరిశ్రమ విడిపోతుందని, శ్రీ సునామీ సృష్టించిందని అన్నారు.

తిరుగుబాటుకు సంబంధించిన ఏ చర్య అయిన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుందని, ఏ కారణాల వల్ల వారు తిరుగుబాటు చేశారనే విషయాన్ని ఒక మనిషిగా అర్థం చేసుకోవడానికి బదులు నెగెటివ్ గా రియాక్ట్ అవుతారని, చేగువేరా చెప్పిన సత్యం ఇదేనంటూ శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ పేర్లను ప్రస్తావించారు. ఇలా జరగడం దురదృష్టకరమే అయినప్పటికీ ప్రస్తుత కాలంలో అనివార్యమైపోయిందని వర్మ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News