charan: ఏ మాత్రం తేడా కొట్టినా అనసూయ నన్ను చంపేసి ఉండేది!: దర్శకుడు సుకుమార్

  • రంగమ్మత్త' పాత్ర గురించి అనసూయకి చెప్పాను 
  • నాపై నమ్మకంతో ఆమె చేసింది 
  • ఆశించిన ఫలితం దక్కింది  
'రంగస్థలం' సినిమా విశేషాలను తాజాగా ఐ డ్రీమ్స్ తో దర్శకుడు సుకుమార్ పంచుకున్నారు. ఈ సందర్భంలోనే అనసూయ విషయం ప్రస్తావనకు రాగా, ఆయన తనదైన శైలిలో స్పందించారు. " 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త' పాత్ర కోసం అనసూయను సంప్రదించినప్పుడు ఆమె చాలా భయపడింది. తనని కాస్త పెద్ద వయసున్న పాత్రలో చూపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది"

"ఆ పాత్ర గురించి నేను ఒకటికి రెండు మార్లు చెప్పడం వలన, నా మీద నమ్మకంతో చేసేసింది. ఆమె పోషించిన ఆ పాత్రకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది .. అనసూయకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర విషయంలో రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా అనసూయ నన్ను చంపేసి ఉండేది" అంటూ నవ్వేశారు.      
charan
samanta

More Telugu News