Rangasthalam: ఉపాసనకు వంట చేసి పెడుతున్న రామ్ చరణ్... చూడండి!

  • 'రంగస్థలం' విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్
  • ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్న హీరో
  • బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్న ఫొటోలను షేర్ చేసిన ఉపాసన

తన తాజా చిత్రం 'రంగస్థలం'తో బంపర్ హిట్ అందుకుని ఆ ఆనందంలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తదుపరి చిత్రం సెట్స్ పైకి వెళ్లేలోగా కొంత సేదదీరాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో గడుపుతూ, కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉపాసన కోసం వంట చేసి పెట్టగా, ఆ ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. "మాస్టర్ చెఫ్... మిస్టర్ సీ... హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను మా కోసం చేస్తున్నారు" అని పోస్టు చేసింది. ఈ చిత్రాల్లో రామ్ చరణ్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నట్టు కనిపిస్తోంది.

More Telugu News