సింహాచలంలో ప్రారంభమైన చందనోత్సవం.. తొలిపూజ చేసిన అశోక్ గజపతిరాజు
- తొలిపూజ చేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు
- స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో
- స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకున్న మంత్రులు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్
కాగా, ఏడాది పాటు చందనంలో కనిపించే వరాహ లక్ష్మీనరసింహస్వామివారు ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విశాఖపట్టణం జిల్లా నుంచే కాకుండా సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు మాట్లాడుతూ, ఈరోజు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవలు జరిగాయని, రెండు గంటలకు స్వామి వారి చందన వితరణ అనంతరం అభిషేకం చేసినట్టు చెప్పారు. పంచకలశ శ్రవణం, ఆరాధన జరిగాయని చెప్పారు.