kolkata: విచారణకు హాజరుకావాలంటూ క్రికెటర్ షమీకి సమన్లు!

  • గృహహింస చట్టం కింద షమీ, కుటుంబసభ్యులపై కేసు నమోదు
  • విచారణకు రావాలంటూ కోల్ కతా పోలీసుల ఆదేశాలు
  • రేపు మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కావాలని సమన్లు
టీమిండియా క్రికెటర్ షమీపై ఆయన భార్య ఫిర్యాదు మేరకు కోల్ కతా పోలీస్ స్టేషన్ లో గృహహింస కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ షమీకి పోలీసులు సమన్లు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.

 షమీ సోదరుడుకి అనారోగ్యం కారణంగా విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరగా, అందుకు పోలీసులు అంగీకరించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు షమీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోల్ కతాలో నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్ కతా రైడర్స్ తో డేర్ డెవిల్స్ తలపడింది. ఈ మ్యాచ్ నిమిత్తం తమ జట్టుతో కలిసి కోల్ కతాకు షమీ వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేయడం గమనార్హం.
kolkata
Cricketer shami

More Telugu News