vijayalakshmi: నాకు చాలా మొహమాటం ఎక్కువ .. ఎవరినీ అవకాశాలు అడగలేదు: సింగర్ విజయలక్ష్మి

  • చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేయలేదు 
  • ఎవరినీ కలిసి అవకాశాలు అడగలేదు 
  • అందుకు కారణం అహంభావం కాదు
విజయలక్ష్మి మంచి సింగర్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆమె వాయిస్ లోని ప్రత్యేకత ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణమైంది. సినిమాల్లో పాడినది కొన్ని పాటలే అయినా, వేల కొద్దీ స్టేజ్ షోలు ఇస్తూ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆమె వాయిస్ విన్నవాళ్లెవరైనా సినిమాల్లో సింగర్ గా ఆమెకి రావలసినంత గుర్తింపు రాలేదనే అంటారు.

 ఇదే విషయాన్ని గురించి 'ఆలీతో సరదాగా'లో విజయలక్ష్మి దగ్గర ప్రస్తావించగా, ఆమె ఆ విషయాన్ని అంగీకరించారు. "చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉండగా ..అక్కడికి వెళ్లి ప్రయత్నాలు చేసే పరిస్థితి లేదు. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసరికి నేను స్టేజ్ షోల వలన బిజీ అయ్యాను. అంతేకాదు నాకు అవకాశం ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేదు. అలా అని చెప్పేసి నాకు అహంభావం అనుకోవద్దు .. మొహమాటం ఎక్కువ అంతే" అని చెప్పుకొచ్చారు.  
vijayalakshmi
ali

More Telugu News