వార్తలకు సర్టిఫికేట్లు జారీ చేయనున్న ఫేస్ బుక్.. ఫేక్ న్యూస్ కట్టడికి ప్రయత్నం
- బూమ్ సంస్ధతో ఒప్పందం చేసుకున్న ఫేస్ బుక్
- వార్తలను విశ్లేషించి రేటింగ్ ఇచ్చే బూమ్
- రేటింగ్ ప్రకారం వార్తలో వాస్తవమెంతో తెలుసుకునే వెసులుబాటు
ఈ సంస్థ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో యూజర్లు పోస్ట్ చేసే వార్తలను ఈ సంస్థ విశ్లేషించి రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ ను ఆ వార్తతో ఫేస్ బుక్ ప్రసారమయ్యేలా చేస్తుంది. దీంతో తక్కువ రేటింగ్ వార్తలను వినియోగదారులు వాస్తవమో, కాదో గ్రహించే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి బూమ్ సంస్థ ఆంగ్ల వార్తలను మాత్రమే విశ్లేషిస్తుందని, తరువాత నెమ్మదిగా ఇతర భాషలకు ఈ సేవలు విస్తరిస్తామని ఫేస్ బుక్ తెలిపింది.