varuntej: సెన్సేషన్ అయిన మెగా హీరో వరుణ్ తేజ్ ట్వీట్!

  • నిన్ను విమర్శించే వారిని పట్టించుకోనవసరం లేదు
  • వారి బలహీనతలు వారు తెలుసుకోలేరు
  • ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపిస్తారు 
మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా చేసిన ఒక ట్వీట్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘‘నిన్ను విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే సంకుచిత మనస్తత్వం గల మనుషులను పట్టించుకోనవసరం లేదు. వాళ్లు తమ బలహీనతలను తెలుసుకోలేనంతటి అల్పులు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా, ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడమే వాళ్లకు ఈజీగా అనిపిస్తుంది’ అంటూ వరుణ్ తేజ్ నర్మగర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ అయింది. బాబాయ్ పవన్ కల్యాణ్ ని శ్రీరెడ్డి విమర్శించిన తర్వాత వచ్చిన ఈ ట్వీట్ కి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. 
varuntej
maga hero
actor
Tollywood

More Telugu News