girl: సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన యువతి

  • యువతిది ఖమ్మం జిల్లా అని గుర్తింపు
  • తన తల్లికి చికిత్స జరుగుతుండడంతో వచ్చిన అమ్మాయి
  • పరిస్థితి విషమం 

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ రోజు గాంధీ ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి ఆమె కిందకు దూకేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సదరు యువతి పేరు దివ్య (22) అని, ఆ ఆసుపత్రిలో తన తల్లికి చికిత్స జరుగుతుండడంతో ఆమె ఇటీవలే అక్కడకు వచ్చిందని తెలిసింది. ఆమె సొంత ఊరు ఖమ్మం జిల్లా అని సమాచారం.  

More Telugu News