vijay devarakonda: 'టాక్సీవాలా' టీజర్ రిలీజ్ ఆ రోజునే!

  • విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీ వాలా'
  • ఈ నెల 18 సాయంత్రం టీజర్ రిలీజ్ 
  • మే 18వ తేదీన సినిమా విడుదల

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'టాక్సీవాలా' రూపొందింది. ఈ సినిమా ద్వారా రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్ గా నటించిన ఈ సినిమాలో, మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ కథానాయికలుగా కనిపించనున్నారు.

 సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఈ నెల 17 సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన టీజర్ రిలీజ్ ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను మే 18వ తేదీన విడుదల చేస్తారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.  

More Telugu News