google: జీ మెయిల్ లో కళ్లు తిరిగే ఫీచర్లు త్వరలో... మెయిల్ చదవడం వరకే... కాపీ చేయలేరు, ఫార్వార్డ్ చేయలేరు!

  • ప్రింట్ కూడా తీసుకునే చాన్స్ ఉండదు
  • పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయరీ డేట్
  • మెయిల్ తెరవాలంటే పాస్ కోడ్.. ఇలా ఎన్నో ఫీచర్లు

జీమెయిల్ లో ఎన్నో కొత్త ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జీమెయిల్ కు కొత్త వెబ్ డిజైన్ ను తీసుకురానున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఫీచర్లకు సంబంధించిన ప్రణాళికలను కూడా బయటపెట్టింది. జీ మెయిల్ కు ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ ను జోడించనుంది. దీని ప్రకారం మీరు ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ను వారు మరొకరికి ఫార్వార్డ్ చేయకుండా చేసుకోవచ్చు.

అంతేకాదు, మీరు పంపిన మెయిల్ ను కాపీ చేయడం కానీ, ప్రింట్ తీసుకునే అవకాశం కానీ ఉండదు. అలాగే, వచ్చిన మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే పాస్ కోడ్ అవసరం. ఈ పాస్ కోడ్ ను టెక్ట్స్ సందేశం ద్వారా గూగుల్ పంపిస్తుంది. అంతేకాదు, పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయిరీ తేదీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే నిర్ణీత సమయం తర్వాత అవి డిలీట్ అయిపోతాయి.

More Telugu News