hyper aadi: ఏడిపించడం చాలా తేలిక .. నవ్వించడమే కష్టం: హైపర్ ఆది

  • మాది ఓ సాధారణమైన కుటుంబం 
  • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేశాను 
  • 'జబర్దస్త్' మంచి పేరు తెచ్చింది  
"ఎవరినైనా సరే ఏడిపించడం చాలా తేలిక .. కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. అలాంటిది అందరినీ నవ్వించే శక్తిని దేవుడు నాకిచ్చాడు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను .. ఆదరణ లభిస్తున్నందుకు ఆనందిస్తున్నాను" అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ 'జబర్దస్త్' హైపర్ ఆది అన్నాడు.

" నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. 'అదిరే అభి' చేయడం వలన 'జబర్దస్త్' వేదికపైకి రాగలిగాను. ఆ తరువాత ప్రేక్షకులు ఆదరించడంతో టీమ్ లీడర్ కాగలిగాను. ఇంతవరకూ 'జబర్దస్త్'లో 100 స్కిట్లు పూర్తి చేశాను. రచన వైపు .. నటన వైపు రావడానికి ముందు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా రెండు సంవత్సరాలు పనిచేశాను. ఏడాదికి 5 లక్షలు వస్తున్నా జీవితంలో ఏదో వెలితిగా అనిపించడంతో, నాకు ఇష్టమైన ఈ రంగానికి వచ్చాను.  ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా జనం నన్ను గుర్తుపడుతున్నారు .. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.  
hyper aadi

More Telugu News