bigg boss: హిందీ 'బిగ్ బాస్' షోకి జంటలకు ఆహ్వానం

  • 'బిగ్ బాస్' రియాలిటీ షో ఆడిషన్స్ ప్రారంభం
  • ఈ సారి జంటలకు ఆహ్వానం
  • 'రైజింగ్ స్టార్' గ్రాండ్ ఫినాలేలో ప్రకటన

హిందీలో ప్రసారమయ్యే 'బిగ్‌ బాస్‌' రియాలిటీ షో సరికొత్త రూపం దాల్చనుంది. ఇంత వరకు 'బిగ్ బాస్' షోలో సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తులు పాల్గొనేవారు. ఈ సారి 'బిగ్ బాస్'  షోకు మరింత మసాలా జోడించేలా జంటగా పాల్గొనవచ్చని నిర్వాహకులు ప్రకటించారు. కలర్స్ టీవీ ఛానెల్ లో 'రైజింగ్ స్టార్' కార్యక్రమం ముగియడంతో 'ఎంటర్ టైన్ మెంట్ కీ రాత్' ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం తరువాత 'బిగ్ బాస్' ను ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది.

సుమారు 100 రోజుల పాటు కొనసాగే ఈ షోని క్రిస్మస్, లేదా ఆ సమయానికి కొంచెం, అటూఇటూగా ముగిసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సారి జంటలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో షో రూపురేఖలపై ఆసక్తి కలుగుతోంది. ఇక ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా సల్మాన్ ఉంటాడా? లేక వేరెవరైనా వస్తారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆడిషన్స్ కి వీడియోలను పంపవచ్చని తెలిపారు. 

  • Loading...

More Telugu News