pruthvi: కమెడియన్ పృథ్వీ ప్రధాన పాత్రలో మూవీ!

  • హాస్యనటుడిగా పృథ్వీకి మంచి పేరు 
  • ఆయన కోసం పాత్రలను సృష్టిస్తోన్న రైటర్స్ 
  • త్వరలో మరో డిఫరెంట్ రోల్ లో పృథ్వీ
తెలుగు తెరపై తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు పృథ్వీ. ఒక సినిమాలో 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన కోసం రచయితలు విభిన్నమైన పాత్రలను సృష్టిస్తూ వస్తున్నారు. ఆ పాత్రలపై తనదైన ముద్ర వేస్తూ ఆయన నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు.

పృథ్వీ క్రేజ్ పెరుగుతూ రావడంతో ఆయనే ప్రధాన పాత్రగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వినోదమే ప్రధానంగా నడిచే ఈ కథలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, ఈ పాత్ర చాలాకాలం పాటు గుర్తుండిపోతుందని అంటున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా హరీశ్, నాయకా నాయికలుగా రాకేందు మౌళి ... కల్పిక పరిచయం కానున్నారు. 
pruthvi

More Telugu News