ex ias: దిగజారిన పరిస్థితులపై ప్రధానికి రిటైర్డ్ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ!

  • ప్రస్తుత దేశ పరిస్థితులు ఆందోళనకరం 
  • ప్రజలకు కనీస భద్రత లేదు 
  • సివిల్‌ సర్వీసెస్‌ రిటైర్డ్‌ ఉన్నతాధికారుల లేఖాస్త్రం  

కథువా, ఉన్నావో‌, సూరత్, అసోం ఘటనలతో దేశప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మీడియాలో ఈ సంఘటనలకు సంబంధించిన సమాచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో 49 మందితో కూడిన సివిల్‌ సర్వీసెస్‌ రిటైర్డ్‌ ఉన్నతాధికారుల బృందం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల పని తీరును ఈ లేఖ ద్వారా నిలదీశారు.

‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలకు కనీస భద్రత ఇవ్వలేకపోతోంది. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకికవాద, స్వేచ్ఛా విలువలు నానాటికీ క్షీణించిపోతున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు పశువుల్లా హత్యాచారానికి పాల్పడటం, దిగజారిన పరిస్థితులను సూచిస్తోంది. స్వాతంత్ర్యానంతరం మేం చూస్తున్న చీకటి రోజులు ఇవే. ఈ పరిస్థితులపై ప్రభుత్వం, బలహీనమైన రాజకీయ పార్టీలు, నేతలు స్పందించకపోవటం మేం గమనించాం. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News