Heat: తెలంగాణలో పెరిగిన ఎండలు... 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత!

  • కొత్తగూడెంలో అత్యధికంగా 41 డిగ్రీలు
  • కోల్ బెల్ట్ ఏరియాలో కార్మికులకు ఇబ్బంది
  • వడదెబ్బతో వ్యక్తి మృతి

తెలంగాణలో ఎండలు మరింతగా పెరిగాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు కొత్తగూడెంలో అత్యధికంగా 41 డిగ్రీలను దాటగా, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 38 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదైంది. పగటి పూట మంటలు పుట్టిస్తున్న సూర్యుడు, వాతావరణ మార్పుల కారణంగా సాయంత్రం 6 తరువాత ఒక్కసారిగా చల్లబడుతున్నాడు.

ఎండ వేడిమి కారణంగా కోల్ బెల్ట్ ఏరియాల్లో కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, పట్టణ ప్రాంతాల్లో కొబ్బరిబోండాలకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం వేళ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. వడదెబ్బల కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగూడెం సమీపంలోని పెనుబల్లిలో ఓ వ్యక్తి ఎండ వేడిమికి తాళలేక మరణించినట్టు తెలుస్తోంది. గడచిన మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

More Telugu News