ఇండియా వర్సెస్ ఇండియా పోరులో సింధుపై నెగ్గిన సైనా

- 21-18, 23-21 తేడాతో సింధుపై నెగ్గిన సైనా
- రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు
- 26కు పెరిగిన స్వర్ణాల సంఖ్య
తొలి గేమ్ నుంచి దూకుడుగా ఆడిన సైనా నెహ్వాల్ మూడు పాయింట్ల తేడాతో సెట్ ను గెలిచి, ఆపై అదే జోరును రెండో సెట్లోనూ కొనసాగించింది. ఆటను మూడో సెట్ కు తీసుకువెళ్లేందుకు సింధూ శ్రమించినా ఫలితం దక్కలేదు. ఈ మ్యాచ్ తరువాత భారత్ ఖాతాలోకి 26వ స్వర్ణ పతకం చేరగా, రజత పతకాల సంఖ్య 17కు పెరిగింది.