KTR: మంత్రి కేటీఆర్‌ ప్రసంగానికి అడ్డుతగిలిన యువకుడు!

  • రవీంద్రభారతిలో అంబేద్కర్ జయంతి వేడుకలు
  • హాజరైన కేటీఆర్, జగదీష్ రెడ్డి
  • అంబేద్కర్ కు పూలమాల ఎందుకు వేయలేదని ప్రశ్నించిన వ్యక్తి
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్రభారతిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడేందుకు లేవగా ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

జ్యోతిరావు పూలేకు నివాళి అర్పించి, అంబేద్కర్ కు ఎందుకు అర్పించలేదని ప్రశ్నించాడు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వ్యక్తితో మాట్లాడాలని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవిని కేటీఆర్ ఆదేశించారు. స్టేజిపై నుంచి కిందకు వచ్చిన రవి... ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తిని బయటకు పంపించివేశాడు. 
KTR
amebedkar
jayanthi
protest

More Telugu News