Talking Movies: ఫలించిన దక్షిణాది నేపథ్య గాయకుల పోరాటం..రాయల్టీపై హక్కు

  • రాయల్టీ చట్టంపై పోరాడిన దక్షిణాది సినీ నేపథ్య గాయకులు
  • సినీ నేపథ్య గీతాల రాయల్టీలో గాయకుడికి కూడా వాటా
  • ఈ విజయాన్ని గళానికి లభించిన గుర్తింపుగా అభివర్ణన

ఉత్తరాది నేపథ్య గాయకుల స్పూర్తితో దక్షిణ భారత సినీ నేపథ్య గాయకులు చేసిన పోరాటం ఫలించింది. ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌ చేసిన న్యాయ పోరాటంతో కాపీ రైట్‌ చట్టంలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉన్న కాపీ రైట్ చట్టం ప్రకారం సినీ నేపథ్య గీతాల రాయల్టీని సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు, సినీ గీత రచయితకు మాత్రమే ఇచ్చేవారు.

ఇకపై సింగర్ కు కూడా ఇవ్వనున్నారు. ఈ మేరకు నేపథ్య గాయకులు రాయల్టీ చట్టంలో మార్పులు చేసేలా ఒత్తిడి తెచ్చారు. పోరాటం ఫలించడంతో ఇకపై సినీ పాటల్లో రాయల్టీపై హక్కును సంపాదించుకున్నారు. ఇది తమ గళాలకు లభించిన గుర్తింపుగా వారు అభివర్ణించారు. సినిమాలో ఒక్క పాటపాడినా నేపథ్యగాయకుడేనని వారు పేర్కొన్నారు. టీవీలలోను, రేడియోల్లోనూ ప్రసారం అయ్యే ఆయా సినిమా పాటల ద్వారా ఈ రాయల్టీ వస్తుంది. 

More Telugu News