shivaji: ప్రధాని మోదీపై సీడీ విడుదల చేసిన హీరో శివాజీ

  • ప్రత్యేక హోదాపై మోదీ హామీల సీడీ విడుదల
  • మోదీకి కూడా పంపుతామన్న శివాజీ
  • రాజకీయ నేతలు సంయమనం పాటించాలన్న సినీ హీరో

ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ తుంగలో తొక్కారని సినీ హీరో శివాజీ అన్నారు. ప్రత్యేక హోదాపై మోదీ ఇచ్చిన హామీల సీడీని విశాఖపట్నంలో ఈరోజు ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ గరుడతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన సమితి తరపున ఈ సీడీని మోదీకి పంపుతామని చెప్పారు.

రాజకీయ నేతల్లో అసహనం పెరిగిపోతోందని... అందరూ సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడకుండా... ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఆపేయాలని అన్నారు. హోదాపై పోరాటాన్ని తొక్కేయడానికే స్వామీజీల గొడవను తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పారు. మే మొదటి వారంలో మరిన్ని నిజాలను బయటపెడతానని తెలిపారు. 

  • Loading...

More Telugu News