Tamilnadu: భోజనం చేసి దీక్ష చేసిన ఏకైక ప్రధాని మోదీయే!: ఖుష్బూ

  • విమానంలోనే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం చేశారు. 
  • తమిళులకు భయపడి హెలికాప్టర్లో తిరిగారు 
  • ఖుష్బూ సంచలన ఆరోపణలు 
పార్లమెంటులో విపక్షాల తీరును నిరసిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు చేబట్టిన ఉపవాస దీక్షను తమిళనాడు కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ ఎద్దేవా చేశారు. ఆ రోజు తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని విమానంలోనే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం తీసుకున్నారని ఖుష్బూ సంచలన విమర్శ చేశారు. ప్రపంచంలో భోజనం చేసి దీక్ష చేపట్టిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆమె వ్యంగ్యంగా అన్నారు. తమిళుల ఆందోళనలకు భయపడిన ప్రధాని రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా హెలికాప్టర్ లో తిరిగారని ఆమె విమర్శించారు. 
Tamilnadu
Congress
khushboo

More Telugu News