Viral Videos: పోలీసులు వెంబడిస్తుండడంతో గేటుని ఢీ కొట్టి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

  • నకిలీ నెంబర్‌ ప్లేట్‌తో దూసుకొస్తోన్న కారు
  • కారును ఆపేందుకు పోలీసుల ప్రయత్నాలు
  • సినిమా సీన్‌ను తలపించేలా తప్పించుకున్న డ్రైవర్

నకిలీ నెంబర్‌ ప్లేట్‌తో వస్తోన్న ఓ కారును ఎలాగైనా ఆపాలని పోలీసులు ఓ చోట ఆ కారుకి అడ్డంగా గేటు వేశారు. అయితే, ఆ కారు డ్రైవర్ మరింత వేగం పెంచి వెడల్పాటి ఆ గేటును ఢీ కొట్టాడు. అనంతరం కారుపై ఆ గేటు పడడంతో దానితో సహా ముందుకు దూసుకెళ్లాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.

దక్షిణ చైనాలోని నన్నింగ్‌ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. చివరకు పోలీసులు ఆ డ్రైవర్‌ను మరో ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సినిమా సీన్ మాదిరిగా గేటును ఢీ కొట్టి ఆ కారు ముందుకు వెళ్లడం పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.  

More Telugu News