Anantapur District: కోచింగ్ సెంటర్ బాత్రూముల్లో రహస్య కెమెరాలు.. నిర్వాహకుడికి దేహశుద్ధి!

  • నీచానికి దిగిన లోటస్ కోచింగ్ సెంటర్ 
  • కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు 
  • నిర్వాహకుడి తాటతీసిన తల్లిదండ్రులు
ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే కోచింగ్‌ సెంటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అనంతపురంలోని లోటస్‌ కోచింగ్‌ సెంటర్‌ భద్రత పేరుతో చేసిన నిర్వాకం బట్టబయలైంది. కోచింగ్ సెంటర్ విద్యార్థినుల బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టి రికార్డు చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థినులు కోచింగ్ సెంటర్ నిర్వాకం గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ కు చేరుకుని, దాని నిర్వాహకుడు సంజీవనాయుడును నిలదీసి, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
Anantapur District
Anantapur
lotus coching center
secret cameras

More Telugu News