Chandrababu: అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: బొత్స సత్యనారాయణ

  • ‘అగ్రిగోల్డ్’ ఆస్తులను కొట్టేయాలని చూస్తోంది
  • అగ్రిగోల్డ్ ని 'బాబు గోల్డ్’ గా మార్చారు
  • ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి

అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన కంటే, ఆస్తులు కొట్టేయాలన్న ఆలోచనలోనే టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వేల కోట్లు కాజేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అగ్రిగోల్డ్ ని 'బాబు గోల్డ్’గా మార్చారని ఆరోపించిన ఆయన, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొరికినంత దోచుకోవడమే పనిగా టీడీపీ ప్రభుత్వం పెట్టుకుందని, ముగ్గురు మంత్రులతో పాటు మరో డెబ్బై మంది అగ్రిగోల్డ్ ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో పాటు  ఢిల్లీలో చంద్రబాబు ఇటీవల జరిపిన రహస్య మంతనాలపైనా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై బొత్స మండిపడ్దారు. వైసీపీపై విమర్శలు చేసిన కుటుంబరావు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడా? లేక టీడీపీ అధికార ప్రతినిధా? అని ప్రశ్నించారు.

More Telugu News