Kamal Haasan: కతువా ఘటనపై కమలహాసన్ ఆవేదన!

  • ఓ మనిషిగా, తండ్రిగా, పౌరుడిగా నాకు చాలా కోపంగా ఉంది
  • ఈ దేశాన్ని నీకు సురక్షితమైన ప్రాంతంగా ఉంచలేకపోయాం 
  • ఐ యామ్ సారీ మై చైల్డ్.. ట్వీట్ లో కమల్ ఆవేదన

జమ్మూకశ్మీర్ లోని కతువాకు చెందిన ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను  ఖండిస్తూ రాజకీయ నేతలు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే పలు ప్రకటనలు చేశారు. తాజాగా, ఈ ఘటనపై మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 ఆ బాలికను కాపాడలేకపోవడంపై ఓ మనిషిగా, తండ్రిగా, పౌరుడిగా తనకు చాలా కోపంగా ఉందని ఓ ట్వీట్ లో కమల్ వాపోయారు. 'ఈ దేశాన్ని నీకు సురక్షితమైన ప్రాంతంగా ఉంచలేకపోయాం .. ఐ యామ్ సారీ మై చైల్డ్. కనీసం, భవిష్యత్తులో నైనా నీలాంటి చిన్నారులకు ఇలా జరగకుండా ఉండేందుకు పోరాడతాను. నీ విషయంలో చాలా బాధపడుతున్నాను..’ అని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కశ్మీర్లో ఎనిమిదేళ్ల  బాలికను కొందరు వ్యక్తులు అపహరించి, ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు.

More Telugu News