prabhas: 'సాహో' హిందీ వెర్షన్ డబ్బింగ్ రైట్స్ 120 కోట్లు?

  • షూటింగ్ దశలో 'సాహో' 
  • 'అబుదాబి'లో చిత్రీకరణ 
  • హిందీ వెర్షన్ హక్కుల కోసం పోటీ

'బాహుబలి' తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి గల క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆ తరువాత ఆయన చేస్తోన్న 'సాహో' కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం 'అబుదాబి'లో షూటింగు జరుపుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ వెర్షన్ అనువాద హక్కుల కోసం బాలీవుడ్ కి చెందిన కొన్ని ప్రముఖ సంస్థలు పోటీపడుతున్నాయట. 120 కోట్ల వరకూ హిందీ అనువాద హక్కులు అమ్ముడయ్యే అవకాశం వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఓ సంస్థ ప్రతినిధులకు .. యూవీ క్రియేషన్స్ వారికి మధ్య చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ డీల్ ఓకే అయితే .. ఒక తెలుగు సినిమా అనువాద హక్కులు ఈ స్థాయిలో అమ్ముడు కావడం ఇదే మొదటిసారి అవుతుందని అంటున్నారు.           

  • Loading...

More Telugu News