sri reddy: శ్రీరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితులు సినీ రంగంలో లేవని అనుకుంటున్నా: హీరో నందమూరి కల్యాణ్ రామ్

  • చిత్ర పరిశ్రమ నాకు తల్లి లాంటిది
  • మూడు పూటలా అన్నం పెడుతోంది
  • బిజీగా ఉన్నా..ఇతరుల గురించి పట్టించుకునే సమయం లేదు
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై హీరో నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు. జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ‘నా నువ్వే’ చిత్రం షూటింగులో ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు శ్రీరెడ్డి అంశం ప్రస్తావనకు వచ్చింది. 

శ్రీరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితులు సినీ రంగంలో లేవని అనుకుంటున్నానని కల్యాణ్ రామ్ అన్నారు. తనకు చిత్ర పరిశ్రమ తల్లి లాంటిదని, మూడు పూటలా అన్నం పెడుతోందని అన్నారు. ప్రస్తుతం బిజీగా ఉన్న తనకు, ఇతరుల గురించి పట్టించుకునే సమయం లేదని అన్నారు. కాగా, ‘నా నువ్వే’ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన తమన్నా జంటగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలైంది.
sri reddy
hero kalyan ram

More Telugu News