KCR: కేసీఆర్‌ దూరదృష్టితో ఉన్నారు: రామ్‌ దేవ్‌ బాబా ప్రశంసల జల్లు

  • కేసీఆర్‌ను కలిసిన యోగా గురు
  • భేటీ అనంతరం ట్వీట్
  • గ్రామీణ ప్రాంతాల సమస్యలపై కేసీఆర్‌కు స్పష్టత ఉందని వ్యాఖ్య
  • ఆర్థిక రంగంపై కూడా పూర్తి స్పష్టత ఉందని ప్రశంస

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యోగా గురు రామ్ దేవ్‌ బాబా కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయనను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి కాసేపు ముచ్చటించారు. భేటీ అనంతరం రామ్‌ దేవ్‌ బాబా తన ట్విట్టర్ ఖాతాలో కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూర దృష్టితో ఉన్నారని, రైతులు, గ్రామీణ ప్రాంతాల సమస్యలపై కేసీఆర్‌కు స్పష్టత ఉందని పేర్కొన్నారు. అలాగే ఆర్థిక రంగంపై కేసీఆర్ ఆలోచనల్లో పూర్తి స్పష్టత ఉందని ప్రశంసించారు. కాగా, కేసీఆర్‌తో భేటీ అయిన రామ్‌ దేవ్‌ బాబా ఏయే అంశాలపై చర్చించారన్న విషయం తెలియాల్సి ఉంది.    

  • Loading...

More Telugu News