sensex: ఐటీ, ఆటో అండతో.. వరుసగా ఆరో రోజూ జోరు కొనసాగించిన మార్కెట్లు

  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 161 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 10,459కి చేరుకున్న నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ జోరు కొనసాగించాయి. ఫెడ్ రిజర్వ్ రేట్ల పెంపు సంకేతాలు, రష్యా-అమెరికాల మధ్య నెలకొన్న విభేదాలు తదితర కారణాలతో ఈ ఉదయం నీరసంగానే మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్నం నుంచి ఆటో, ఐటీ, టెక్, పవర్ షేర్ల అండతో మార్కెట్లు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు లాభపడి 34,101కి పెరిగింది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 10,459కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (9.51%), డిష్ టీవీ (8.13%), టాటా స్పాంజ్ ఐరన్ (8.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.47%), గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ (4.20%).

టాప్ లూజర్స్:
అలెంబిక్ ఫార్మా (-6.25%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-5.78%), బలరాంపూర్ చీనీ మిల్స్ (-5.36%), వక్రాంగీ (-4.97%), జీఎంఆర్ ఇన్ఫ్రా (-4.82%).

More Telugu News