KCR: రేపు బెంగళూరు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

  • దేవేగౌడతో భేటీ కానున్న కేసీఆర్
  • జాతీయ రాజకీయాలపై చర్చ
  • ఇటీవలే మమత, హేమంత్ సొరేన్ లతో కేసీఆర్ చర్చలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బెంగళూరు వెళ్తున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వెళ్తున్నారు. దేవేగౌడతో భేటీ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ చేసుకుంటారు. దేవేగౌడతో భేటీ సందర్భంగా దేశ రాజకీయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. మూడో ఫ్రంట్ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కూడా కేసీఆర్ కలిశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు.  
KCR
devegowda
bengaluru
trip

More Telugu News