sri reddy: హీరోయిన్ శ్రీరెడ్డికి గుడ్ న్యూస్.. అనుకూలంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్!

  • శ్రీరెడ్డికి మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్
  • తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రసార శాఖలకు నోటీసులు
  • నటించకుండా అడ్డుకోవడం ముమ్మాటికీ హక్కులకు భంగం కలిగించడమేనన్న కమిషన్

టాలీవుడ్ లో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డికి ఊహించని మద్దతు లభించింది. ఆమెకు మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలిచింది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం ముమ్మాటికీ ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర సమాచార ప్రసారశాఖలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఇంతవరకు విచారణ జరపకపోగా... ఆమెపైనే కేసు పెట్టిన విషయాన్ని కమిషన్ ప్రశ్నించింది. మరో విషయం ఏమిటంటే... కేంద్ర మానవ హక్కుల కమిషన్ ను శ్రీరెడ్డి ఆశ్రయించకపోయినప్పటికీ... కమిషనే ఆమె కేసును సుమోటోగానే స్వీకరించి, చివరకు నోటీసులు జారీ చేసింది.

More Telugu News