narasimharaju: చిరంజీవి గురించి చాలామందికి ఈ విషయం తెలియదు!: నరసింహరాజు

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. మరో వైపున కృష్ణ .. శోభన్ బాబు తెలుగు తెరపై తమ హవాను కొనసాగిస్తూ ఉండగా, కథానాయకుడిగా నిలదొక్కుకున్న సాహసీకుడిగా నరసింహరాజు కనిపిస్తారు. తాజాగా ఐ డ్రీమ్స్ తో ఆయన మాట్లాడుతూ తన మనోభావాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. చిరంజీవి గురించి అడిగిన ప్రశ్నలకి ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

" ఎన్టీఆర్ మహానుభావుడు .. రాముడు .. కృష్ణుడు ఎలా వుంటారో తెలియదు. కానీ ఆ దేవుళ్లకు దణ్ణం పెట్టుకుంటూ వుంటే ఆయన రూపమే గుర్తుకువస్తుంది. ఏఎన్నార్ విషయానికొస్తే .. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందంగా కనిపించడంలో ఆయన తరువాతనే ఎవరైనా. శోభన్ బాబు .. మురళీ మోహన్ .. మరికొందరు ఆయనను ఫాలో అయినవాళ్లే. ఇక చిరంజీవి మంచి డాన్సర్ .. చాలామంచి వ్యక్తి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన గుప్తదానాలు ఎక్కువగా చేస్తుంటారు" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
narasimharaju

More Telugu News