bjp: యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో మోదీ చేసి చూపించారు : బండారు దత్తాత్రేయ

  • ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు
  • మచ్చ లేని నాయకుడు మోదీ
  • చంద్రబాబు, కేసీఆర్ లవి వారసత్వ రాజకీయాలు 
యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో ప్రధాని మోదీ చేసి చూపించారని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రధాని పిలపు మేరకు ఒక్కరోజు దీక్షకు దత్తాత్రేయ కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో మచ్చ లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ప్రశంసించారు. 

మహిళల కోసం‘బేటీ బచావో బేటీ పడావో’, ముందు చూపుతో ‘స్వచ్ఛభారత్’ వంటివి తీసుకొచ్చిన ఘనత మోదీది అని అన్నారు. దేశ ప్రజలే మోదీ వారసులని చెప్పిన ఆయన, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తన కుమారుడిని రాజకీయ వారసుడిగా తీసుకొస్తున్నారని, ఏపీలోనూ చంద్రబాబు వారసత్వ రాజకీయాలు నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు.
bjp
bandaru dattatreya
Narendra Modi

More Telugu News