Rajamouli: రేపటి నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలు!

  • బాహుబలి తరువాత రాజమౌళి చిత్రానికి ఎంపికైన ఎన్టీఆర్
  • అంతకన్నా ముందుగా మరో సినిమా
  • రేపు ప్రారంభోత్సవం, వెంటనే షూటింగ్
బాహుబలి తరువాత రాజమౌళి తదుపరి చిత్రానికి ఓ హీరోగా ఎంపికైన ఎన్టీఆర్, అంతకన్నా ముందు మరో సినిమాతో అభిమానులను పలకరించనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓకే చేసిన సినిమా ప్రారంభోత్సవం రేపు జరగనుంది. సినిమా షూటింగ్ కూడా రేపటి నుంచే మొదలవుతుందని సమాచారం.

ఇక ఈ చిత్రం కోసం గతంలో ఎన్నడూ కనిపించని గెటప్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడని, అందుకోసం జిమ్ లో ఎంతో వర్కవుట్స్ చేస్తున్నారని చెబుతూ కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. సినిమా కోసం త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్ ను తయారు చేశారని, ఓ నవల ఆధారంగా సినిమా కథ తయారైందని సినీ వర్గాల సమాచారం. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తారని కూడా తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ కు 28వ చిత్రం అవుతుంది.
Rajamouli
trivikram srinivas
NTR
new Movie

More Telugu News