narasimha raju: అందుకే మా అబ్బాయిని సినిమాల వైపుకు రానీయలేదు: నటుడు నరసింహరాజు

  • మా అబ్బాయికి నటన పట్ల ఆసక్తి వుంది 
  • ఇటు వైపుగా రావొద్దని నేనే చెప్పాను 
  • విన్నాడు కనుకనే మంచి పొజిషన్ లో వున్నాడు    
నిన్నటితరం కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడిగా మనకి నరసింహరాజు కనిపిస్తారు. జానపద చిత్రాల ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేసిన ఆయన, తాజాగా ఐడ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "మా అబ్బాయికి నా మాదిరిగానే నటన పట్ల ఆసక్తి వుండేది. మంచి హైటూ .. పర్సనాలిటీ ఉండటం వలన సినిమాల్లోకి రావాలనుకున్నాడు"

"మా అబ్బాయి సరదా పడినప్పటికీ వద్దని నేనే చెప్పాను. సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే అదృష్టం ఉండాలి .. అవకాశాలు రావాలి .. ఆదరణ దక్కాలి. పరిణతిని సాధించేలోగా ఏదో ఒకటి మాట్లాడేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బిహేవియర్ బాగోలేదంటూ పక్కన పెట్టేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన వద్దని చెప్పాను .. నా మాట విన్నాడు కనుక కెనడాలో బ్యాంక్ మేనేజర్ గా మంచి పొజిషన్ లో వున్నాడు" అని చెప్పుకొచ్చారు.       
narasimha raju

More Telugu News