Shirdi: రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే!: షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ డిమాండ్

  • షిర్డీ అద్భుతాలకు అంతే లేదన్న రాహుల్
  • దేవుడి పేరు ఎందుకు ప్రస్తావిస్తారన్న ట్రస్ట్ చైర్మన్
  • భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్య

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది మంది ఆరాధించే షిర్డీ సాయిబాబా పేరును ప్రస్తావించడం తగదని, అందుకాయన క్షమాపణలు చెప్పాల్సిందేనని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయుష్ గోయల్ ను టార్గెట్ చేస్తూ, నిన్న రాహుల్ "షిర్డీ అద్భుతాలకు అంతే లేదు" అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సురేష్ హవారే స్పందించారు.

రాహుల్ ట్వీట్ తో తనకు బాధేసిందని అన్నారు. రాజకీయ ఆరోపణలు చేసే వేళ, దేవుడిని లాగడం ఏంటని ప్రశ్నించారు. ఆయన ట్వీట్ తో ఇండియాతో పాటు దేశ విదేశాల్లో ఉన్న సాయి భక్తుల సెంటిమెంట్ దెబ్బతిందని, ఇందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక ట్రస్ట్ డిమాండ్లపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా స్పందిస్తూ, షిర్డీ పేరు పెట్టుకుని ఎన్నో కంపెనీలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయని గుర్తు చేశారు. ట్రస్ట్ పెద్దలు ఈ విషయాన్ని సెబీ దృష్టికి, మోదీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

More Telugu News