బీజేపీ ఎంపీ గోకరాజు దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన పోలీసులు
- మోదీ దీక్షకు మద్దతుగా భీమవరంలో గోకరాజు దీక్ష
- మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ, సీపీఎం
- ఇరు వర్గాల మధ్య తోపులాట
ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీక్షా శిబిరం వద్దకు పలువురు వైసీపీ, సీపీఎం కార్యకర్తలు చేరుకుని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, అన్ని పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.