Donald Trump: ట్రంప్ ఆశ తీరడం లేదు.. అందని బ్రిటీష్ రాచకుటుంబ వివాహ ఆహ్వానం!

  • మే 19న ప్రిన్స్ హ్యారీ వివాహం
  • ట్రంప్ కు అందని ఆహ్వానం
  • బయటవారిని ఆహ్వానించడం లేదన్న రాజప్రాసాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆశాభంగమైంది. వివరాల్లోకి వెళ్తే, బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహనికి ఇంత వరకు ట్రంప్ కు ఆహ్వానం అందలేదు. ఈ వివాహానికి రాజవంశం, మేఘన కుటుంబంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు రాజప్రాసాదం వారు ప్రకటించారు. రాజకీయ నేతలను వివాహానికి ఆహ్వానించడం లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో వివాహానికి వెళ్లాలనుకున్న ట్రంప్ ఆశలపై నీరు చల్లినట్టైంది. తనకు ఆహ్వానం అందితే కచ్చితంగా పెళ్లికి వెళతానని గతంలోనే ట్రంప్ తెలిపారు. మరోవైపు, బ్రిటన్ రాచ కుటుంబానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ట్రంప్ ను ఆహ్వానించకుండా ఒబామాను ఆహ్వానిస్తే బాగుండదనే ఉద్దేశంతో ఆయనకు కూడా ఆహ్వానం పంపలేదు. హ్యారీ, మేఘన్ ల వివాహం మే 19న జరగనుంది. 
Donald Trump
price harry
marriage
wedding invitation
british

More Telugu News