అల్జీరియా విమాన ప్రమాదంలో మృతులు 257 మంది!
- బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ వెళ్తున్న విమానం
- టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన వైనం
- ప్రాణాలతో బయటపడిన ఇద్దరు
మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైరింజన్లు, 14 అంబులెన్స్ లను వినియోగించినట్టు తెలిపారు. విమానంలోని మృతులంతా ఆర్మీకి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులేనని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని, ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని వారు తెలిపారు. కాగా, 2014లో ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన భారీ విమాన ప్రమాదం ఇదేనని తెలుస్తోంది.