ipl: గంభీర్ సేనకు మరో పరాజయం... రహానే సేన బోణి

  • ఐపీఎల్ లో బోణి కొట్టిన రాజస్థాన్ రాయల్స్
  • గంభీర్ సేనకు రెండో పరాజయం
  • రెండేళ్ల నిషేధం తరువాత సొంత మైదానంలో రహానే సేనకు విజయం

ఐపీఎల్ సీజన్-11లో అజింక్యా రహానే సేన బోణి కొట్టింది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత సొంత మైదానం జైపూర్ లో ఆడిన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు రహానే (45), సంజు శాంసన్ (37), జోస్ బట్లర్ (29) రాణించడంతో 17.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడడంతో ఆటకు అంతరాయం కలిగింది.

అనంతరం మ్యాచ్ ప్రారంభం కాగా, డక్ వర్త్ లూయిస్ పధ్ధతిలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ లక్ష్యాన్ని 6 ఓవర్లకు 71గా అంపైర్లు నిర్ణయించారు. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్‌ మున్రో (0) తొలి బంతికే రనౌట్‌ అయ్యాడు. మ్యాక్స్‌ వెల్‌ (17), రిషభ్‌ పంత్‌ (20), క్రిస్ మోరిస్ (17), విజయ్ శంకర్ (3) విఫలమయ్యారు. దీంతో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తన ఇన్నింగ్స్ ముగించి, ఓటమిపాలైంది. 

  • Loading...

More Telugu News