ajay ghosh: ఆర్టిస్ట్ గా చేస్తూనే కూలి పనికి వెళ్లిన సందర్భాలు వున్నాయి: నటుడు అజయ్ ఘోష్

  • ఇబ్బందులు పడుతున్నవాళ్లను చూశాను
  • నేను కూడా ఎన్నో బాధలు పడ్డాను 
  • ఏదోఒకటి తేల్చుకోవాలనే వచ్చాను  
ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్ కి, 'రంగస్థలం' సినిమా మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తనకి ఎదురైన కొన్ని పరిస్థితులను గురించి ప్రస్తావించారు. "సినిమా రంగంలో రాణించాలనే పట్టుదలతో ఇక్కడికి వచ్చి ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో నాకు తెలుసు" అన్నారు.

 "ఇక్కడ ఎవరిని కదిలించినా భయంకరమైన సంఘటనలు బయటికి వస్తాయి. అవకాశాలు రాక .. ఆకలికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అట్లా నేను పడిన బాధలు .. అవమానాలు ఎన్నో వున్నాయి .. ఎన్నని చెప్పమంటారు? సీరియల్స్ లో నటిస్తూ వున్నప్పుడు కూడా గ్యాప్ వచ్చేది .. అప్పుడు యూసఫ్ గూడా అడ్డా నుంచి మాదాపూర్ కి కూలి పనికి వెళ్లేవాడిని. ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను కాబట్టి .. అవన్నీ నాకు పెద్ద కష్టాలుగా అనిపించలేదు" అని చెప్పుకొచ్చారు.  
ajay ghosh

More Telugu News