raviteja: 'నేల టిక్కెట్టు' నిర్మాతతోనే మరో రెండు సినిమాలు చేయనున్న రవితేజ

  • ముగింపు దశలో 'నేల టిక్కెట్టు'
  • ఆరంభ దశలో 'అమర్ అక్బర్ ఆంటోనీ'
  • రామ్ తాళ్లూరితో ఆ తరువాత సినిమాలు

ప్రస్తుతం రవితేజ తనకి గల మాస్ ఫాలోయింగ్ కి తగినట్టుగానే 'నేల టిక్కెట్టు' సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, షూటింగు పరంగా చివరిదశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల మూవీ 'అమర్ అక్బర్ ఆంటోని' షూటింగులో రవితేజ జాయిన్ కానున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.

 ఈ సినిమా తరువాత 'నేల టిక్కెట్టు' నిర్మాత రామ్ తాళ్లూరి తోనే మరో రెండు సినిమాలు చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒక సినిమాకి బాబీ .. మరో సినిమాకి బీవీఎస్ రవి దర్శకులుగా వ్యవహరించనున్నారని సమాచారం. ఇక రవితేజ అభిమానులు మే నెలలో విడుదల కానున్న 'నేల టిక్కెట్టు' కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.     

  • Loading...

More Telugu News