Vijayawada: కేవీపీ, రఘువీరారెడ్డి అరెస్ట్... విజయవాడలో ఉద్రిక్తత!

  • రసాభాసగా మారిన జ్యోతీరావు ఫూలే జయంతి వేడుకలు
  • సీఎం వస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
  • అరెస్ట్ చేసి తరలింపు - స్టేషన్ లోనే నిరసన

బడుగు నేత జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవ వేడుకలు విజయవాడలో రసాభాసగా మారాయి. ఇక్కడి జ్యోతీరావు విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి వచ్చిన వేళ, అదే సమయంలో సీఎం చంద్రబాబు వస్తున్నారని పోలీసులు వారిని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు అక్కడికి వచ్చారు.

పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలూ నిరసనకు దిగగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి కేవీపీ, రఘువీరా తదితరులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. నేతలను ఎక్కించిన వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించగా, వారి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు స్టేషన్ లోనే ఆందోళన చేపట్టారు. చంద్రబాబు సర్కారు దమనకాండకు ఈ ఘటన నిదర్శనమని కేవీపీ నిప్పులు చెరిగారు.

More Telugu News