అత్త పాత్రతో రీ ఎంట్రీ ఇస్తోన్న సిమ్రాన్!

  • నిన్నటితరం  హీరోయిన్ గా క్రేజ్
  • తమిళంలో ఈ మధ్యనే రీ ఎంట్రీ
  • త్వరలో తెలుగు తెరపై  
తెలుగు ప్రేక్షకులను గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ప్రభావితం చేసిన నిన్నటితరం కథానాయికలలో సిమ్రాన్ ఒకరు. 'సమర సింహా రెడ్డి' .. 'కలిసుందాం రా' .. 'నరసింహనాయుడు' .. 'మృగరాజు' వంటి సినిమాలు ఆమె అగ్రకథానాయకులతో చేసింది. అలాంటి సిమ్రాన్ వివాహం తరువాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. తమిళంలో కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, అక్కడ ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తోంది.

ఒక తెలుగు సినిమాను కూడా ఆమె అంగీకరించిందనీ .. అందులో అత్త పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథనట. అందువల్లనే అత్త పాత్ర కోసం సిమ్రాన్ ను ఓకే చేసినట్టు తెలుస్తోంది. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.        
Go Back to Shorts
saptagiri
simran

More Telugu News